దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైన సీఎం కేసీఆర్ అని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు అన్నారు. కరీంనగర్‌లోని మంత్రి మీ సేవ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గతంలో పాలకులు పేదల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల బాగు కోసం ఆడబిడ్డలందరూ కేసీఆర్‌ను ఆశీర్వదించి, అండగా నిలవాలని కోరారు. రైతులకు వ్యవసాయానికి కరెంటు, రైతుబంధు కింద ఆర్థిక సాయం, ఎరువులు సకాలంలో ప్రభుత్వం అందిస్తుందన్నారు. అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవెని మధు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కార్పొరేటర్లు గంట కల్యాణి, కుర్ర తిరుపతి గందే మాధవి, ఐలేందర్ యాదవ్, అర్ష కిరణ్మయి, ఆర్ష మల్లేశం, నాంపల్లి శ్రీనివాస్, గందె మహేశ్, వాసాల రమేశ్, మెచినేని అశోక్, కోల సంపత్, గంట శ్రీనివాస్ పాల్గొన్నారు.