ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.
పాదయాత్రలో భాగంగా కుప్పంలో నారా లోకేష్ కు స్థానిక టీడీపీ కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో బీసీలకు పథకాలు అందలేదు.
కుప్పంలో పార్టీ పరిస్థితి బాగోలేదని.. తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఓ టీడీపీ కార్యకర్త బహిరంగంగా మైక్లో చెప్పడంతో అక్కడున్నవారంతా షాకయ్యారు.
దీంతో వెంటనే మైక్ అందుకున్న నారా లోకేశ్.. గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు బాగాలేదు.. కుప్పం మున్సిపాలిటీని గెలిచిన వైసీపీ నేతలు ఏం పీకారంటూ మండిపడ్డారు.