Home / SLIDER / తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త

తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉపాధ్యాయుల బ‌దిలీల‌కు సంబంధించి పూర్వ‌పు జిల్లాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన ఆదేశాల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు 317లో వేరే జిల్లాకు బ‌దిలీ అయిన ఉపాధ్యాయుల‌కు పూర్వ జిల్లా స‌ర్వీసును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉపాధ్యాయ బ‌దిలీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం త‌న కార్యాల‌యంలో విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప‌దోన్న‌తుల ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 ఉంచి 14వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉపాధ్యాయులంద‌రికీ స‌మ‌న్యాయం చేకూర్చాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఇప్ప‌టికే వ‌చ్చిన 59 వేల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి చేయ‌బ‌డుతంద‌ని స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat