తెలంగాణ రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్‌లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్టీఐ మైం డ్ ట్రీ ఐటీ కంపెనీ ఈ నెలాఖరులో వరంగల్‌లో తన డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించా రు.
మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గొల్లపు కలిసి, వరంగల్‌లో ఏర్పాటు చేసి న తమ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆ హ్వానించారు. దీనికి మంత్రి కేటీఆర్ సమ్మతి తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులో కార్యాలయా న్ని ప్రారంభించనున్నట్టు కేటీఆర్ ప్రకటించా రు. ఎల్టీఐ మైండ్ ట్రీకి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇందులో 90 వేల మందికిపైగా పనిచేస్తున్నారు.