తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి శుక్రవారం జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. ఈ ఏడాది ప్రారంభించబోయే బీసీ డిగ్రీ గురుకులాలు ఇవే జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంబీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రారంభించనున్నారు.