ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా 2022-23 విద్యాసంవత్సర తరగతులు బీ.సి డిగ్రీ గురుకుల కళాశాలలు 4 మంజూరు చేసిన సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్‌స్థాయిలో విద్యను అందిస్తోంది.గౌరవ సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నత విద్యను, అత్యున్నత వసతులతో కూడిన హాస్టల్ సౌకర్యాన్ని ఉచితంగా అందించి విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు.
విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని నమ్మే సీఎం కేసీఆర్, అందుకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు. గురుకులాల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్యనభ్యసిస్తున్నారని మంత్రి ఆనందం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో 17 కళాశాలు మంజూరు కాగా, అందులో ఉమ్మడి జిల్లాలో హనుమకొండ, మహబూబా బాద్, ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కళాశాలలు ఈ విద్యాసంవత్సరం (2023 2024)లో ప్రారంభం కానున్నాయి. దీంతో అడ్మిషన్లు కల్పించనున్నారు. వెనుకబడిన మారు మూల ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తూ అండగా నిలుస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి సత్యవతి రాథోడ్.