Home / SLIDER / దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు

దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు

తెలంగాణ రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గార్లు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దక్షిణ కొరియా లోని పర్యాటక ప్రదేశాలను అధ్యయనం చేయడానికి నేడు రాజధాని సీయోల్ నగరం లో పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా సియోల్ నగరంలో గత కొరియన్ వార్ లో ఉపయోగించిన తర్వాత నిరుపయోగంగా ఉన్న యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, సబ్ మెరైన్లు, త్రివిధ దళాలకు చెందిన Arms లతో ఏర్పాటు చేసిన పార్కు ను పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గార్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, అధికారులతో సంప్రదించి భారత దేశ త్రివిధ దళాలు గత యుద్ధాలలో ఉపయోగించి నిరుపయోగంగా ఉన్న యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, మెరైన్ లతోపాటు యుద్ధం లో వాడిన ARMS లను వారి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద WAR MEMORIAL PARK ను ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనల ను CM KCR గారికి సమర్పిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కొరియా తరహాలో ఏర్పాటు చేసే WAR MEMORIAL PARK ద్వారా నేటి యువత లో యుద్ధం పట్ల అవగాహన, ఆసక్తి, ధైర్యం, నాలెడ్జ్ పరంగా, దేశం పై అభిమానం, దేశభక్తి పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు.ఈ పర్యటనలో పర్యాటక శాఖ ఎండి మనోహర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ లు పాల్గొన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat