తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పదవి నుంచి తొలగించాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ‘గజ్వేల్ బచావో.. నర్సారెడ్డి హఠావో’ అం టూ నినదించారు.నర్సారెడ్డిని డీసీసీ పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటూ ప్ల్ల్లకార్డులు ప్రదర్శించారు.
అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్‌కు నర్సారెడ్డిపై రాతపూర్వకంగా ఫిర్యా దు చేశారు. ఈ నిరసనలో టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు, నాయకుడు మా దాడి రంగారెడ్డి, తిగుల్ సర్పంచ్ కే భానుప్రకాశ్‌రావు, మహిపాల్‌రెడ్డి, మామిడాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు.