భారత్ రాష్ట్ర సమితికి మహారాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నది. ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల కీలక నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.
తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన కార్పొరేటర్ నగేశ్‌తో పాటు ఆయన మద్దతుదారులు, ఇతర నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు……..