పరకాల పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డువిస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి సోమవారం హనుమకొండలోని వారి స్వగృహంలో తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు పట్టాలను స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు లబ్ధిదారులకు అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసీఆర్ గారు పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్లు వారు తెలిపారు.
దాదాపు అన్ని ఇండ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు.ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.