Breaking News
Home / EDITORIAL / మూడుతోనే కాంగ్రెస్‌ కు మూడింది!

మూడుతోనే కాంగ్రెస్‌ కు మూడింది!

ప్రజల మన్ననలను పొందిన నాయకులే రాజకీయాల్లో రాణిస్తారు. అంతేకానీ, ప్రజలను మోసగించి రాజకీయాల్లో రాణించాలనుకునేవారు ఎన్నటికీ విజయం సాధించలేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అయితే తాజాగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి హోదాలో తన వ్యక్తిగత పనుల కోసం అమెరికా వెళ్లిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటుపై దివాలాకోరు, దిగజారుడు మాటలు మాట్లాడారు.

ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిశాయి. కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రాష్ట్ర రైతాంగం ఉతికి ఆరేసింది. కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేసి పాడె కట్టింది. రైతులు కష్టాన్ని నమ్ముకొని బతికేవారే కానీ, తమ కడుపు మీద కొడితే ఎంతకైనా తెగిస్తారని మరోసారి రుజువైంది.

రాష్ట్రంలోని నిరసన సెగలు అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డికి గట్టిగనే తాకినయి. అందుకే వెంటనే రాష్ట్రంలో వాలిపోయిండు. అయితే ఒక అబద్ధం, వంద అబద్ధాలు ఆడేలా చేస్తుందనేది పెద్దలు చెప్పిన మాట. రేవంత్‌ విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎకరానికి మూడు గంటల కరెంటు చాలు, 24 గంటల నిరంతర విద్యుత్‌ నిరుపయోగమని వల్లించిన రేవంత్‌రెడ్డి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజురోజుకు అబద్ధాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇదిపోను, తన వ్యాఖ్యలను మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారని ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు. మార్ఫింగ్‌ల వెనుక ఐటీ మంత్రి కేటీఆర్‌ ఉన్నాడంటూ ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇందుకు తన రాజకీయ గురువుగా చెప్పుకొనే చంద్రబాబునూ వాడుతున్నాడు. అయితే విచిత్రమైన విషయం ఏమంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఉచిత కరెంటును ప్రవేశపెట్టాడంటూ ఆయన్నూ కీర్తిస్తున్నాడు.

రేవంత్‌రెడ్డిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందేమో. పూటకో మాట మార్చే రేవంత్‌రెడ్డిలో అధికార దాహం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. కానీ, అధికారం ఊరికే రాదనే విషయం ఆయనకు ఇంకా అర్థం కావకపోవడమే విడ్డూరం. ప్రజలు ఆదరిస్తే అధికారం వస్తుంది. ప్రజలు ఊరికే ఆదరించరు, వారికి అనుకూల నిర్ణయాలు తీసుకుంటే ఆదరిస్తరు. ఉద్యమకాలం నుంచి నేటిదాకా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న యువనేత కేటీఆర్‌. పద్నాలుగేండ్లు కొట్లాడి తెలంగాణను సాధించాడు కేసీఆర్‌. ఆయన పోరాట పటిమ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరేలా చేసింది. అందుకే ప్రజలు ఆయనను ఆదరించారు. ఇప్పుడు కేసీఆర్‌ను యావత్‌ ప్రపంచం కీర్తిస్తుంటే, కేటీఆర్‌ వాక్చాతుర్యాన్ని ప్రపంచ నేతలు కొనియాడుతున్నారు. కేటీఆర్‌ ప్రధాని కాగల సమర్థుడని విదేశీ మహిళ కీర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది.

2018 జనవరి 1న 24 గంటల నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్‌కు పునాది పడిందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నాటినుంచి నేటిదాకా కనురెప్ప వాల్చి తెరిచేంత సేపు కూడా కరెంటు పోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరెంటు పరిస్థితి ఇట్లాగే ఉంది. నేడు రైతన్న దర్జాగా మిట్ట మధ్యాహ్నం మోటర్‌ పెట్టేందుకు బాయికాడికి పోతున్నడు. కరెంటు షాకుల్లేవు, పాము కాటు మరణాలు అసలుకే లేవు. రైతుల్లో ఇప్పుడిప్పుడే ఆత్మైస్థెర్యం పెరుగుతున్నవేళ కొందరు రాష్ర్టాభివృద్ధికి మోకాలు అడ్డుతూనే ఉన్నారు. అందుకే కాంగ్రెస్‌ నేతలు ఎదురైతే చాలు ప్రజలు విరుచుకుపడుతున్నారు. మీ కాంగ్రెస్‌ పార్టీ ఎట్లా మూడు గంటల కరెంటు ఇస్తుందో, గంటకు ఎకరం ఎలా పారిస్తుందో చేసి చూపాలంటూ నిలదీస్తున్నారు. రైతుల ప్రశ్నల వెనుక ఆక్రోశం కనపడుతున్నది, ఆవేదేన కనపడుతున్నది.

కేంద్ర ప్రభుత్వం గతంలో ఉచిత విద్యుత్తును ఎత్తివేసి మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ మెడపై కత్తిపెట్టింది. అయినా కేంద్రానికి లొంగిపోలేదు. 24 గంటల ఉచిత కరెంటును కాపాడుకోవడం కోసం ఏకంగా 30 వేల కోట్ల రూపాయల రుణాన్ని వదులుకున్నది తప్ప, రైతు ప్రయోజనాలపై రాజీ పడలేదు.

కేసీఆర్‌ నాయకత్వంలో రైతు అనుకూల విధానాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి అయ్యింది. ఈ పరిస్థితుల్లో రైతుల పొట్ట కొట్టేందుకు వ్యవసాయానికి 3 గంటలు చాలు, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటును మూడు గంటలకు కుదిస్తామంటూ ఊదరగొడితే ఊరుకునేవారెవ్వరూ ఉండరు. రేవంత్‌రెడ్డి నోరు జాగ్రత్త. నోరుంది కదా అని ఎంత పడితే అంత మాట్లాడితే రానున్న ఎన్నికల్లో ప్రజలే నీకు, నీ కాంగ్రెస్‌ పార్టీకి సరైన రీతిలో బుద్ధిచెప్తారు.

(వ్యాసకర్త: టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌)
అనిల్‌ కూర్మాచలం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino