యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం ఉదయం భోనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరం అంజయ్య ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం మంత్రి జగదీష్ రెడ్డిని కలసి అంబెడ్కర్ భవన నిర్మాణ విషయాన్ని ప్రస్తావించారు.
అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అంబెడ్కర్ భవన నిర్మాణానికి గాను మంజూరు అయిన రెండు కోట్ల నిధుల నుండి కోటి 40 లక్షలు వ్యయం చేసి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మిగిలిఉన్న 40 లక్షల తో పాటు అవసరమైన నిధులు మంజూరు చేసి అంబెడ్కర్ భవనాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.