Home / SLIDER / తెలంగాణకు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి

తెలంగాణకు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి

వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని, వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా సీఎం కేసీఆర్‌ రాజకీయాలపై దృష్టి పెట్టారని , వరద సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతటా గత వారం రోజులుగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు, గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగి ప్రవహించాయి.భారీ వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తూ, అధికారులను , పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ..తాను నిద్ర పోకుండా , అధికారులను నిద్ర పోనివ్వకుండా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసారు. అలాంటి కేసీఆర్ పట్టుకొని ఈరోజు రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

తండ్రి వయసున్న కేసీఆర్ ను పట్టుకొని పిండం పెట్టాలని మాట్లాడుతున్నావు..అది నోరా..మూసి నదా..? అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతుంటే..నువ్వు ఎక్కడ పడుకున్నావ్..రేవంత్ రెడ్డి..? ఎంపీ రేవంత్ రెడ్డి కనిపించడం లేదని పోస్టర్లు వెలిశాక కానీ నీకు జనాల మధ్య కు రావాలని అనిపించలేదా..? వర్షాలు తగ్గినా తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వం వరద ముప్పుపై సమీక్షలు చేయలేదు..ప్రజలు వరదలతో అల్లాడుతుంటే మంత్రి కేటీఆర్ పట్టించుకోలేదని మాట్లాడుతున్నాడు. ఆలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది..? నువ్వు చూసావా..అసలు అధికారులు ఎలా పనిచేసారో..వరదల నుండి ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడిందో..? అని రేవంత్ ను శ్రవణ్ ప్రశ్నించారు.

వర్షాలు పడుతుంటే కుంభకర్ణుడివలే ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుని..ఈరోజు రోడ్ల పైకి వచ్చి ప్రభుత్వం ఫై విమర్శలు చేయడానికి బుద్ది ఉందా అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వరదలతో ప్రజలు ఆపదలో ఉంటె వారిని ఆదుకోవడం మానేసి కేసీఆర్ , కేటీఆర్ ల ఫై విమర్శలు చేయడానికి నీకు మనసెలా వచ్చింది రేవంత్ రెడ్డి.? వరదలు వస్తే పాలు, బ్రేడ్, పులిహోర, అన్నం పంచవు కానీ నీ కార్యకర్తలతో శాలువా కప్పించుకొని ఉరేగుతున్నావు..అసలు నువ్వు మనిషివేనా అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

రేవంత్ చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం, ఏదిపడితే అది అనడం చేస్తున్నాడు. కించపరచడం తప్పు కాదు కానీ దానిపేరు మీద ఎలాపడితే ఆలా, ఎవర్ని పడితే వారిని అవతలి వ్యక్తి వయసును సైతం లెక్కచేయకుండా అనరాని మాటలు అనకూడదు కదా.. అని శ్రవణ్ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం చావునోట్లే తలకాయిపెట్టి , నిద్రాహారాలు లేకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తెలంగాణను దేశానికే తలమానికంగా ఎంతో అభివృద్ధి చేస్తున్న ఆయనను పట్టుకొని నువ్వు పిండం పెట్టాలని అంటావా..? ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ఓ ర్యాలీలో ప్రధాని మోడీ ఫై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గుజరాత్ కోర్ట్ లో కేసు వేస్తే..రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పోయింది. మరి నువ్వు ఈరోజు కేసీఆర్ కు పిండం పెట్టాలని అన్నావు కాబట్టి నీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు శ్రవణ్.

సబర్మతీ ఆశ్రమానికి ఎవరైనా వెళ్లి బాపు… మీ శిష్యునిగా ఉంటూ..స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటా అంటే..ముందుగా వారిచేత టాయిలెట్స్ కడిగించేవారు..ఆలా ఒకటి , రెండుసార్లు కాదు మూడు , నాల్గు సార్లు కడిగించిన తర్వాత..సబర్మతీ ఆశ్రమంలో అన్ని పనులు చేసావు కాబట్టి సమాజంలో అంతకంటే పేరుకుపోయిన మురికిని శుభ్రం చెయ్యి అని స్వాతంత్ర ఉద్యమంలో చేర్చుకునేవారు మహాత్మా గాంధీ. అలాంటి సిద్దాంతం కాంగ్రెస్ పార్టీది , మహాత్మా గాంధీది. కానీ రేవంత్ లాంటి గాడ్సే కు మహాత్మా సిద్ధాంతం అర్ధం కావడం లేదు.ముందు రేవంత్ రెడ్డి సబర్మతి ఆశ్రమం లో టాయిలెట్స్ ను కడిగించలని రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీనీ, మల్లికార్జున్ ఖర్గే గారిని కోరుతున్నాని శ్రవణ్ అన్నారు.

ఓ ముఖ్యమంత్రి ని పట్టుకొని చార్ల్స్ శోభరాజ్ అంటాడు. ఎవరి చార్ల్స్ శోభరాజ్..? అతడికి కేసీఆర్ కు పోలిక ఏంటి..? అసలు ఇలా మాట్లాడొచ్చా..? వయసు కు గౌరవం ఇవ్వవు..ఆయన కుర్చీకి గౌరవం ఇవ్వవు..తెలంగాణ కోసం కష్టపడినా దానికి గౌరవం ఇవ్వవు..ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న నీ పదవికి గౌరవం ఇవ్వవు..కాంగ్రెస్ పార్టీ కి గౌరవం ఇవ్వవు..బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డి ని టీపీసీసీ అధ్యక్షాపదవి నుండి తొలగించాలని శ్రవణ్ డిమాండ్ చేసారు.

పౌరుష పదజాలం, బూతుపదజాలమే రాజకీయమా..? ఇదేనా మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కి నేర్పింది..? లేక సమాజానికి నేర్పింది..? కాబట్టి సభ్యసమాజం ఆలోచించండి. విధివిధానం తప్పు ఉంటె కించపరచండి, మంచి జరగాలని డిమాండ్ చేయండి. అంతే కానీ ఎలాపడితే ఆలా కించపరుస్తాం అంటే కుదరదు అని శ్రవణ్ అన్నారు. వర్షాలు పడుతుంటే ప్రజలను నువ్వు అదుకోవాల్సింది పోయి..ఇంట్లో పడుకొని , తీరిగ్గా వర్షాలు తగ్గినా తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వం ఫై , ముఖ్యమంత్రి ఫై , అధికారులపై విమర్శలు చేయడం తగదు.

మహాత్మాగాంధీ వారసులమని , 120 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు. అలాంటి హోదాలో ఉన్న రేవంత్ రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్నాడు. యాదవులను పేడ పిసుకుంటారని కించపర్చడం, దొమ్మర్లను, వంశరాజులను హేళన చేయడం..మిగతా కులాలను చులకన చేయడం రేవంత్ కు అలవాటుగా మారింది. గొల్ల కురుమలు, బీసీలను, ఎస్సిలను, ఎస్టీ లను ఇలా ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు.రేవంత్ చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం మంచిది కాదని , మా నైజాం ఇదే..ఇలాగే మాట్లాడతాం అంటే ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారని శ్రవణ్ హెచ్చరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat