తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలుగా మారిన 1851 తండాలు గిరిజన తండాలలో స్థానికులకే పాలనాధికారం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చి ఐదేండ్లు పూర్తయ్యింది. ‘మా తండాలో మా రాజ్యం. తండాలుగా గ్రామ పంచాయతీలుగా మార్చాలి’ అన్న డిమాండ్‌తో గిరిజనులు రెండున్నర దశాబ్దాల పాటు పోరాటం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో వారి డిమాండ్‌ను ఏ నాయకుడూ పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. మాయ చేసి ఓట్లు వేయించుకోవడం.. ఆ తరువాత పట్టించుకోకపోవడం నాటి పాలకులకు రివాజుగా మారింది. గిరిజనుల దశాబ్దాల కలను వారి కోణంలో అర్థం చేసుకొని దానిని నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది.
ఉమ్మడి పాలకులు చెప్పిన సాకులన్నంటినీ అధిగమించి, చిన్న పంచాయతీలు ఆచరణ సాధ్యం కాదంటూ చేసిన వాదన సరికాదని, తండాలను పంచాయతీలుగా మార్చారు. 2018 ఆగస్టు 1న రాష్ట్రంలోని 1851 తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో సైతం లేనంత మంది గిరిజనులు గ్రామ సర్పంచులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికయ్యారు.