Home / ANDHRAPRADESH / చేతులెత్తేసిన చంద్రబాబు లాయర్ లూథ్రా..అన్ని దారులు క్లోజ్..ఈ ట్వీట్లే సాక్ష్యం..!

చేతులెత్తేసిన చంద్రబాబు లాయర్ లూథ్రా..అన్ని దారులు క్లోజ్..ఈ ట్వీట్లే సాక్ష్యం..!

స్కామ్ స్టర్ చంద్రబాబు అరెస్ట్ అయి ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది..జైలుకు వెళ్లి 4 రోజులైంది..పాపం ఇటు టీడీపీ నేతలు, అటు పచ్చ మీడియా శోకాలకు అంతే లేకుండా పోయింది..ఏదో జరగరాని ఉపద్రవం జరిగిపోయినట్లుగా, ఏదో భూగోళం బద్ధలైనట్లుగా, అన్యాయం, అక్రమం, రాజకీయ కక్ష సాధింపు అంటూ…గావు కేకలు పెడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నాయి..బాబుగారిని బయటకు తీసుకువచ్చేందుకు పుత్రరత్నం లోకేష్, బామ్మర్ది బాలయ్య, దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేయని ప్రయత్నం లేదు..ఏకంగా ఢిల్లీ నుంచి ఖరీదైన లాయన్ సిద్ధార్ట్ లూథ్రాని పట్టుకొచ్చారు. గతంలో కొన్ని కేసుల్లో తన క్లయింట్స్ కి శిక్ష పడకుండా తప్పించాడంటూ లూథ్రాని పచ్చ మీడియా తెగ మోసేసింది..అయితే ఫస్ట్ రోజే..సిఐడీ న్యాయవాదుల వాదనల ముందు లూథ్రా తేలిపోయాడు..అసలు లూథ్రా ఎత్తులకు చిత్తు అయిన సీఐడీ…బాబుగారు జైలుకు వెళ్లే ఛాన్సే లేదు..స్కిల్ కేసు ఇంక సంకనాకిపోయినట్లే…కోర్టు కేసును కొట్టేస్తుంది..దర్జాగా బయటకు వస్తాడని పచ్చ మీడియా బాకాలు ఊదింది..కానీ సీబీఐ కోర్టు మాత్రం లూథ్రా తలాతోకా లేని వాదనల కంటే…పక్కా ఆధారాలతో వచ్చిన సీఐడీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించి..చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది..దీంతో పోలీసులు బాబుగారిని భద్రంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో దించేసి వచ్చారు..

ఇక అప్పటి నుంచి రోజుకు కోట్లలో ఫీజు తీసుకునే లూథ్రా బాబుగారిని బయటకు తీసుకువచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు.. హౌస్ అరెస్ట్ అంటూ…గతంలో ఆ కేసు..ఈ కేసు అంటూ లూథ్రా వినిపించిన సొల్లు వాదనలను ఏసీబీ కోర్టు కొట్టేసింది..ఇక లాభం లేదనుకుని హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేస్తే..హుష్..తొందరేముంది..అంటూ హైకోర్టు విచారణను ఈ నెల 19 వరకు వాయిదా వేసింది..ఇప్పుడు అంగళ్లు విధ్వంసం కేసులో చంద్రబాబును మళ్లీ అరెస్ట్ చేస్తారనే భయంతో లూథ్రా హైకోర్టులో మళ్లీ ముందస్తు బెయిల్ పిటీషన్ వేస్తే..దానిని కూడా ఈ నెల 20 వరకు వాయిదా వేసింది..దీంతో దేశంలోనే పాపులర్ అండ్ కాస్ట్లీ లాయర్ అయిన సిద్ధార్థ్ లూథ్రాకి పిచ్చెక్కుతున్నట్లు ఉంది…అందుకే ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని, ఇక చంద్రబాబును బయటకు తీసుకురాలేమనే నిర్వేదాన్ని ప్రతిబింబించేలా వరుస ట్వీట్లు చేస్తున్నాడు..ఎంత ప్రయత్నించినా న్యాయం లభించకపోతే, అప్పుడు కత్తి తీయడమే సరైన పని. కత్తితో యుద్ధం చేయడమే సరైనది” అని ఉంది. ఆ వాక్యాలు ఔరంగజేబుకి వార్ణింగ్ ఇస్తూ గోవింద్ సింగ్ రాసిన ఉత్తరంలోనివని కూడా అదే ట్వీటులో ఉంది. అంటే ఔరంగజేబ్ తమని హింసిస్తుంటే సహించి సహించి ఇక భరించలేక కత్తులేసుకుని తిరగబడతామని గోవింద్ సింగ్ చేసిన హెచ్చరిక అన్నమాట.

అసలు లూథ్రా ఔరంగజేబు గురించి ఏ ఉద్దేశంలో ట్వీట్ చేశాడో..కానీ తెలుగు ప్రజలకు ఔరంగజేబు అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబే..స్వర్గీయ ఎన్.టి.రామారావే స్వయంగా తన అల్లుడు చంద్రబాబు ఎంత కుట్రదారుడో చెబుతూ ఔరంగజేబుతో పోల్చాడు. ఆ వీడియో యూట్యూబులో ఇప్పటికీ ఉంది..ఓ సారి లూథ్రా ఆ వీడియో చూస్తే తాను ఆంధ్రా ఔరంగజేబు తరపున వాదిస్తున్నానా అంటూ రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండా వెళ్లిపోతాడు…అయినా ఒక లాయర్ అయి ఉండి కేసుల్లో బెయిల్ రానంత మాత్రానా ..కోర్టుల్లో న్యాయం దొరకలేదంటూ కత్తితో పొడవాలంటాడా…ఎవరిన్ని పొడవాలి..ఒక కేసు జరుగుతుండగా ఇలాంటి ట్వీట్లు చేసి పచ్చ గూండాలను రెచ్చగొడితే..రేపు పోలీసులకో..న్యాయవాదులకో లేదా ప్రభుత్వ పెద్దలకో.. జరగరానిది జరిగితే లూథ్రా బాధ్యత వహిస్తాడా..అందుకే రాంగోపాల్ వర్మ కూడా “ఏందయ్యా! తెలుగుదేశం జనాల్ని ఆయుధాలు పట్టుకుని పోలీసుల మీద, న్యాయవ్యవస్థకు చెందినోళ్ల మీద దూకమని చెప్తున్నావా” అంటూ లూథ్రాకు లాగిపెట్టి ఒకటిచ్చాడు…

అయినా లూథ్రా ఏ మాత్రం తగ్గేదేలా అంటున్నాడు..తాజాగా వివేకానంద కోట్ ఒకటి ట్వీట్ చేశాడు. ‘స్వామి వివేకానంద కర్మయోగంలో ఇలా అంటాడు.. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలి’. అదేవిధంగా.. న్యాయం, ధర్మంకోసం నిలబడిన సిక్కు గురు చెప్పిన సూక్తులను అర్థం చేసుకోనివారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ లూథ్రా ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు..చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉండడంతో కోర్టులో సీఐడీ న్యాయవాదుల వాదనల ముందు చేష్టలుడిగిపోయిన లూథ్రా..ఇలా నిర్వేదంతో వరుస ట్వీట్లు చేస్తున్నాడని టీడీపీ శ్రేణులకు కూడా అర్థమవుతోంది..లూథ్రా ట్వీట్లను చూస్తే చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవని టీడీపీ నేతలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కేసుల్లో అన్ని దారులు మూసుకుని పోవడంతో ఫ్రస్ట్రేషన్‌ నుంచి ఫిలాసఫీలోకి వచ్చాడని..ఈయన గారికి కోట్లు కోట్లు పోసినా..కనీసం బాబుగారికి ఒక్క కేసులో అయినా బెయిల్ తీసుకువచ్చాడా…ఎందుకు దండగ …అమరావతిలో చెట్టుకింద ప్లీడర్ బెటర్ అంటూ…తెలుగు తమ్ముళ్లు లూథ్రాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat