టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొద్ది రోజులుగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న సంగతి విదితమే .తాజాగా వీరిద్దరూ మొన్న దీపావళికి చాలా ప్రకటనల్లో కలిసి కనిపించారు.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోసుకున్నారు. అందరినీ అలరించడం చూసి ప్రేక్షకులూ ఫిదా అయ్యారు. తాజాగా ఈ ప్రేమ జంట ఒక వైద్యుడిని కలసింది. బాలీవుడ్ అందాల భామలు కత్రినా కైఫ్, జాక్వెలైన్ ఫెర్నాడెంజ్కు ఇష్టమైన ఆక్యూపంచరిస్ట్ డాక్టర్ జెవెల్ గమాదియానే ఆ వైద్యుడు. విరాట్ కోహ్లీ కోసం ఆయన్ను అనుష్క సూచించింది. వీరిద్దరూ తనను కలిసిన చిత్రాల్ని గమాదియానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.