ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా ఏరియా ఆస్పత్రిలో రూ 38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డయాగ్నస్టిక్ సెంటర్ భవనమునకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య వసేవలు అందించేందుకు వైద్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు
20 కోట్ల రూపాయలతో నిర్మల్ వంద పడకల జిల్లా ఏరియా ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించడం, అలాగే 50 పడకల ప్రసూతి ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు తెలిపారు. 5 పడకలు ఉన్న డయాలసిస్ సెంటర్ ను 15 పడకలకు,10 పడకలు ఉన్న ఐసీయూ సెంటర్ ను 20 పడకలకు పెంచనున్నట్లు, ట్రామ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుటకు డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోగులు డయాగ్నస్టిక్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు నీడనిచ్చేందుకు ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటాలని మంత్రి అన్నారు. ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రత ఉండేలా చూడాలని ఆసుపత్రి సూపరిండెంట్ ను ఆదేశించారు .
