Home / CRIME / టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు బీభత్సం

టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు బీభత్సం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు సంబంధించిన వాహానం బీభత్సం సృష్టించింది.

ఏటూరునాగారం మండలం జీడివాగు దగ్గర ఎమ్మెల్యే కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. అయితే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.