Home / 18+ / ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్‌తో కలిసి దర్శించుకున్న దరువు ఎండీ  కరణ్ రెడ్డి

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్‌తో కలిసి దర్శించుకున్న దరువు ఎండీ  కరణ్ రెడ్డి

అంగరంగ వైభవంగా లష్కర్‌ బోనాల జాతర జరుగుతోంది.ఈ ఆదివారం మధ్యాహ్నం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారు, దరువు మీడియా సంస్థల అధినేత కరణ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పండితులు, మంత్రులు, అధికారులు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.