Home / INTERNATIONAL / వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ టవర్స్‌పై ఉగ్రదాడికి నేటికి 18 ఏళ్లు…!

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ టవర్స్‌పై ఉగ్రదాడికి నేటికి 18 ఏళ్లు…!

సెప్టెంబర్ 11… ఈ పేరు వినగానే అమెరికన్లు కలలో కూడా ఉలిక్కిపడతారు. ప్రపంచం మొత్తం గజగజా వణికిపోతారు. అమెరికా చరిత్రలోనే కాదు…ప్రపంచ చరిత్రలోనే పెను విషాదం ఈ రోజు చోటు చేసుకుంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఈ రోజు ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం అమెరికా చివురుటాకులా వణికిపోయింది. అమెరికా ఆర్థిక శక్తికి సూచకంగా అమెరికన్లు గర్వంగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌‌లోని ట్విన్ టవర్స్ క్షణాల్లో కుప్పకూలి, దగ్ధమైన ఈ దుర్ఘటన ఇప్పటికీ అమెరికన్ల కళ్లలో కదలాడుతూనే ఉంటుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నాటి బిల్‌క్లింటన్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాలతో ఆల్‌ఖైదా నాయకుడు బిన్‌లాడెన్ అమెరికాపై కత్తికట్టాడు. అగ్రరాజ్యానికి తమ సత్తా ఏంటో చూపించాలని భావించిన బిన్‌లాడెన్ అగ్రరాజ్యంపై ఉగ్రదాడికి కుట్ర పన్నాడు. లాడెన్ కుట్రలో భాగంగా ఆల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన మారణహోమమే…ఈ సెప్టెంబర్ 11 ఉగ్రదాడి. ఈ రోజు మార్నింగ్ డబ్ల్యూటీవో ఆఫీసు ఉద్యోగులతో, సందర్శకులతో కళకలాడుతుంది. తొలుత నాలుగు పాసింజర్ విమానాలను హైజాక్ చేసిన ఆల్‌ఖైదా‌కు చెందిన ఆత్మాహుతి దశం రెండు విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ట్విన్‌ టవర్స్‌ను ఢీకొట్టి విమానాలను పేల్చివేశారు. ఈ ఉగ్రదాడిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్‌లోని ట్విన్ టవర్స్ నేలకూలగా..హైజాకర్స్‌తో పాటు సుమారు మూడువేల మంది మరణించారు. .మరో ఆరువేల మంది గాయాలపాలయ్యారు. మరో విమానం పెంటగాన్‌ సమీపంలో కుప్పకూలింది.

ఆల్‌ఖైదా తీవ్రవాదులు జరిపిన ఈ ఉగ్రదాడిలొ ట్విన్ టవర్స్ కుప్పకూలిన అనంతరం భవన శకలాలను తొలగించడానికి రెండు వేలమంది సిబ్బందికి దాదాపు ఎనిమిది నెలల కాలం పట్టింది. ఈ దుర్ఘటనలో చెలరేగిన మంటలు పూర్తిగా తగ్గడానికి 100 రోజులు పట్టిందంటే టెర్రరిస్టుల దాడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఉగ్రదాడి జరిగిన మరుక్షణంశిధిలాలను తొలగించిన తర్వాత డబ్ల్యూటీసీ భవనం ఉన్న ప్రదేశానికి అమెరికా ప్రభుత్వం గ్రౌండ్ జీరో అనే పేరు పెట్టి ఇక్కడ స్వేచ్ఛా సౌధం పేరుతో నూతన భవన నిర్మాణం చేపట్టింది. సెప్టెంబర్ 11 న ఉగ్రవాదుల దాడి సమయంలో మరణించిన వారికి సంబంధించిన జ్ఞాపకాలతో గ్రౌండ్‌ జీరోకు దగ్గర్లో ఓ మ్యూజియంను కూడా ఏర్పాటు చేసింది. అమెరికా ప్రజలకు పెను విషాదాన్ని మిగిల్చిన సెప్టెంబర్ 11 ప్రపంచ చరిత్రలో బ్లాక్‌డే మిగిలిపోయింది. సెప్టెంబర్ 11న అమెరికాపై ఉగ్రదాడితో ప్రపంచం తీవ్ర దిగ్భాంతికి లోనైంది. భారత్‌తో సహా అన్ని దేశాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 11 ఉగ్రదాడి జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినప్పటికీ ప్రపంచ దేశాలను ఉగ్రభూతం పట్టిపీడిస్తూనే ఉంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇండియా..ఇలా అన్ని దేశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక దేశంలో ఉగ్రమూకలు దాడులకు తెగబడుతునూ ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ దేశం స్వయంగా ఉగ్రవాదులకు ఆశ్రయిస్తూ..భారత్‌‌లో మారణ హోమం జరిపేందుకు కుట్రలు చేస్తున్నాయి. సౌత్ ఇండియాతో సహా, దేశంలోని పలు నగరాల్లో ఉగ్రదాడులు జరుగబోతాయన్న ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలన్నీ ఏకమై, మానవ మనుగడకే సవాలు విసురుతున్న ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat