Home / SPORTS / ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన ఈడెన్ గార్డెన్స్..డే/నైట్ ఎఫెక్ట్ !

ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన ఈడెన్ గార్డెన్స్..డే/నైట్ ఎఫెక్ట్ !

శుక్రవారం నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్, ఇండియా మధ్య రెండో టెస్ట్ మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఇది డే/నైట్ మ్యాచ్ కాబట్టి ప్రతీ ఒక్కరు దీనికోసమే ఎదురుచూసారు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకుంది బంగ్లా. భారత బౌలర్స్ దెబ్బకు 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంతేకాకుండా మరో ఎండ్ లో ఇండియా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 174/3 పరుగులు చేసింది. అయితే ఇక అసలు విషయానికే వస్తే నిన్న ఈడెన్ గార్డెన్స్ మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ఇది వన్డే కాదు, టీ20 కాదు ఐనప్పటికీ మొత్తం ప్రేక్షకులతో ఫుల్ అయ్యింది.