Home / SPORTS / నిన్న టైటిల్.. నేడు పెళ్లి.. రేపు సిరీస్ !

నిన్న టైటిల్.. నేడు పెళ్లి.. రేపు సిరీస్ !

తన జట్టుకు టైటిల్ సాధించిపెట్టాలనే పట్టుదలతో తన పెళ్ళికి ఒక్కరోజు ముందుకూడా జట్టుకి తోడుగా ఉండి. అద్భుతమైన బ్యాట్టింగ్ తో తన రాష్ట్రానికి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని తెచ్చిపెట్టాడు.అది ఆదివారం జరగగా సోమవారం నాడు భారతీయ సినీ నటి అశ్రుత శెట్టిని మనీష్ ముంబైలో వివాహం చేసుకోనున్నాడు. టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడిన పాండే “ఇండియా సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను, కానీ దీనికి ముందు నాకు మరో ముఖ్యమైన సిరీస్ ఉంది, నేను రేపు వివాహం చేసుకోబోతున్నాను” అని చెప్పాడు. మరి పెళ్లి తరువాత ఇండియా జట్టులో కూడా ఇదే ఫామ్ ను కొనసాగిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.