Home / POLITICS / ఎంపీ అర్వింద్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎంపీ అర్వింద్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ తో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ” గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధాలతో.. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి ఎంపీగా గెలిచారు. ఐదురోజుల్లో పసుపు బోర్డును తీసుకు వస్తానని హామీచ్చి అర్వింద్ ఐదారు నెలలైన కానీ ఇంతవరకు పసుపుబోర్డు గురించి దిక్కు లేదు.. మొక్కు లేదు”అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధికి కొన్ని కోట్ల రూపాయలను మంజూరు చేశారని.. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అండగా ఉన్నారని “అన్నారు.