Home / SPORTS / టీ 20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కెప్టెన్‌ ఎంపిక

టీ 20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కెప్టెన్‌ ఎంపిక

ఆస్ర్టేలియాలో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపికైంది. కౌర్‌ నేతృత్వంలో భారత జట్టు తరపున ఆడే 15 మంది జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్‌ కప్‌ టీంలో రిచా ఘోష్‌ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం. ఇటీవల మహిళల ఛాలెంజర్స్‌ ట్రోఫీలో సత్తా చాటిన రిచాకు టీమిండియాలో చోటు కల్పించారు. వరల్డ్‌ టీ20 టీంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌) సహా స్మృతి మంధానా, అరుంధతి రెడ్డి, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్జ్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్‌, తానియా భాటియా, పూనం యాదవ్‌, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌లకు చోటు దక్కింది.