Breaking News
Home / SPORTS / కోహ్లి ఎందుకా తప్పు చేసావ్..? సీనియర్లు ఫైర్ !

కోహ్లి ఎందుకా తప్పు చేసావ్..? సీనియర్లు ఫైర్ !

మంగళవారం ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఇందులో ఆస్ట్రేలియాపై భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీనికి ముఖ్య కారణం ఏమిటనేది మాట్లాడుకుంటే అందరూ కోహ్లి పేరే చెబుతున్నారు. ముఖ్యంగా కోహ్లిపై సీనియర్లు సైతం మండిపడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు హెడన్ విషయానికి వస్తే గత కొంతకాలంగా అటు ఐపీఎల్ ఇటు ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో భారత్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దాంతో టీమిండియాపై బాగా అవగాహన ఉండడంతో ముఖ్యంగా కోహ్లి మూడో స్థానంలో లో కాకుండా నాలుగో స్థానంలో వచ్చి ప్రయోగం చేయడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. రాహుల్ మూడో స్థానంలో వచ్చి ఆడినప్పటికీ కోహ్లికి  కి ఆ స్థానంలో 10వేల పరుగులు సాధించిన ఘనత ఉంది. కాని నాలుగో స్థానం విషయానికి వస్తే అస్సల బాలేదని చెప్పాలి. మరి ఎందుకు ఈ ప్రయోగం చేసాడని హెడన్ అన్నాడు.