Breaking News
Home / SPORTS / చెత్త అంచనాలు…ఈ వైఫల్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు !

చెత్త అంచనాలు…ఈ వైఫల్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు !

మంగళవారం ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆసీస్. దాంతో ముందుగా బ్యాట్టింగ్ కి వచ్చిన ఇండియా ధావన్, రాహుల్ తప్పా మిగతావారు చేట్టులేట్టేసారు. భారత్‌ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. అనంతరం చేజింగ్ వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఆ టార్గెట్ ను వికెట్ పడకుండా కొట్టేసార్టు. దాంతో ఒక్కసారిగా యావత్ దేశం నిబ్బరపోయింది. ఒక్క బౌలర్ కూడా వికెట్ తీయలేకపోయారు. వాళ్ళని అంచనా వేయడంలో కోహ్లి విఫలం అయ్యాడు అని చెప్పాలి. కొత్త సంవత్సరంలో ఇది భారత్ కు జీవితాంతం గుర్తుండిపోతుంది. భారత బాట్స్ మెన్ లు పరుగులు చెయ్యడానికి అన్ని కష్టాలు పడితే ఆసీస్ ఓపెనర్స్ మాత్రం అలవోకగా పరుగులు సాధించారు.