Breaking News
Home / INTERNATIONAL / కరోనా వైరస్ విషయంలో తప్పుడు వార్తలు వద్దు..!

కరోనా వైరస్ విషయంలో తప్పుడు వార్తలు వద్దు..!

చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ప్రబలిన కరోనావైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో 80 మంది మరణించారు. చైనాలో కరోనావైరస్ రోగుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్నదని, కొంత మంది మరణించారని వాట్సాప్ ద్వారా కొందరు ఆకతాయిలు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ వార్తలు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయి. రూఢి చేసుకోకుండా ఇటువంటి ఫేక్ వార్తలు ఫార్వర్డ్ చేయకుండా ఉంటే మంచిది.