Breaking News
Home / SPORTS / చేతులెత్తేసిన భారత్..క్లీన్ స్వీప్ చేసిన కివీస్ !

చేతులెత్తేసిన భారత్..క్లీన్ స్వీప్ చేసిన కివీస్ !

భారత్, కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో వన్డే జరిగింది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాట్టింగ్ విషయానికి వస్తే అగర్వాల్, కోహ్లి చేతులెత్తేశారు. ప్రిథ్వి షా 40పరుగులు చెయ్యగా. ఐయ్యర్, రాహుల్ మంచి భాగస్వామ్యం నమోదు చేసారు. చివర్లో పాండే అద్భుతంగా బ్యాట్ చేసాడు.దాంతో నిర్ణీత 50ఓవర్స్ లో భారత్ 296 పరుగులు చేయగా..కివీస్ టార్గెట్ ను అలవోకగా చేదించింది. ఓపెనర్స్ అద్భుతంగా రాణించారు, అనంతరం కివీస్ ఆల్ రౌండర్ అద్భుత బ్యాట్టింగ్ తో విజయం సాధించారు. తద్వారా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసారు. టీ20 సిరీస్ ఘోరంగా ఓడిపోయిన కివీస్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. ఇది భారత్ కు కొల్కోలేని దెబ్బ అని చెప్పాలి.