Breaking News
Home / SPORTS / మోదీ, ట్రంప్ చేతులమీదగా ప్రారంభంకానున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం !

మోదీ, ట్రంప్ చేతులమీదగా ప్రారంభంకానున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం !

ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అందులోను అది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆసీస్ మైదానలంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే ఇప్పుడు దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అది అహ్మదాబాద్ లో ఉంది. దీనిని ప్రత్యేకంగా లక్షా 10వేల సిట్టింగ్ తో తయారు చేయడం జరిగింది. భారత క్రికెట్ అభిమానులు ఓపెనింగ్ ఎప్పుడు ఉంటుంది అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ స్టేడియం ఈ నెల 24న ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతులుమీదగా ప్రారంభం కానుంది.