భారత్ – ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో భాగంగా నేడు నాగ్‌పూర్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ చేస్తోంది.30 ఓవర్లు ముగిసే సమాయానికి ఆస్ట్రేలియా అరోన్ ఫించ్, కెప్టెన్ స్మిత్‌ల, వార్నర్‌ల వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ మరోసారి ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. స్మిత్‌ను కేదార్ జాదవ్ ఎల్బీడబ్ల్యూ ద్వారా అవుట్ చేయగా, ఫించ్‌ను హార్థిక్ ప్యాండా అవుట్ చేశాడు.. హ్యాండ్స్కోంబ్ కూడా అక్షర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. వన్డేల సిరీస్‌లో ఇండియా వరుసగా తొలి మూడు వన్డేలు చేయగా నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా గెలిచి పరువు కాపాడుకుంది..మరి 5 వ వన్డేలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
