ఢాకాలో జరిగిన ఆసియా కప్ హాకీ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఢాకాలో ఈ రోజు మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. భారత్ తరుపున ఆకాష్ దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్‌లు చెరొక గోల్‌ను వేశారు. అంతకు ముందు టోర్నీ ఆరంభంలో మలేషియా జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఆసియా కప్ సాధించిన యువ ఆటగాళ్లపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
