పసిడి ధరలు పతనమవుతూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల 24 క్యారెట్‌ల ధర రూ.200లు తగ్గి రూ.30,450లకు చేరుకుంది. పండుగ సీజన్ ముగియడం, ముఖ్యంగా బంగారం వ్యాపారుల నుంచి ఆర్డర్లు తగ్గడం, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధర పతనమవతూ వస్తోంది. మరో వైపు వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.50లు పెరిగి రూ.40,900లకు పెరిగింది.
