తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయంతో మందడుగు వేస్తోంది. ఇపపటికే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలు తసీఉకున్న ప్రభుత్వం ఈ క్రమంలో మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో దేశంలోనే అతిపెద్ద వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. జీడిమెట్లలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏర్పాటు కానున్న భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ అని అన్నారు. త్వరలోనే ఈ ప్లాంట్ నిర్మాణ పనులను పూర్తి చేసి రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రారంభిస్తామన్నారు.
ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ఉన్న సి అండ్ డి ప్లాంట్ల కన్న హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసి ప్లాంట్లు అధిక సామర్థ్యంతో కూడినవని మేయర్ తెలిపారు. జీడిమెట్ల ప్లాంట్‌లో రోజుకు 500 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జీడిమెట్ల ప్లాంట్‌కు సంబంధించి నిర్మాణ వ్యర్థాలను రవాణా చేయడానికి ఇప్పటికే పది వాహనాలను సేకరించడం జరిగిందని పేర్కొన్నారు. అత్యంత ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా ఏవిధమైన దుమ్ము లేవడం జరగదని స్పష్టం చేశారు. సుమారుగా 24 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ చుట్టూ పెద్ద ఎత్తున్న మొక్కలు నాటాలని సూచించారు. కార్మికులకు సిబ్బందికి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్లాంట్‌కు అప్రోచ్ రోడ్ ప్రతిష్టాంగా నిర్మించాలని ఆదేశించారు.
ఫతుల్లాగూడ, జీడిమెట్లలో ప్లాంట్ల ఏర్పాటుకు ఓపెన్ టెండర్ ద్వారా సి అండ్ డి ప్లాంట్ నిర్వహణకు తక్కువ కోట్ చేసిన రాంకీ ఎన్విరో లిమిటేడ్ అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మేయర్ తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల మెట్రిక్ టన్ను తరలింపుకు ట్రిప్పుకు రూ.342ల చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల ద్వారా ఇటుకలు, ఇసుక ఇతర నిర్మాణ మెటిరియల్‌లను ఈ ప్లాంట్‌లో తయారీ అవుతాయని పేర్కొన్నారు. సిఅండ్‌డీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్ నగరం దేశంలోనే ఈ సౌకర్యాన్ని కల్పించిన నాల్గొవ నగరంగా నిలిచిందన్నారు.
Post Views: 320