Home / TELANGANA / మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవ‌లు….

మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవ‌లు….

మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమ‌ని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్ర‌క‌టించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయ‌న తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మ‌ధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా 30 కి.మీ. దూరంలో తొలి విడతలో ఐటీ కారీడార్ లో 10 రూట్ లలో 50 బస్సులు ప్రయోగాత్మకంగా మెట్రోకు అనుసందానంగా బ‌స్సులు నడుపుతామ‌ని మంత్రి వివ‌రించారు.మొత్తంగా మెట్రో రైల్ 24 రైల్వే స్టేషన్ లకు ఇరువైపుల 22 కాలనీలకు ఆర్టీసీ 212 ట్రిప్పుల  బస్సులకు అంచనా వేస్తుందని తెలిపారు.
ఇలా మెట్రో రైలు మూడు విడతలకు ఆర్టీసీ ప్రయాణికుల సేవలకు అనుసంధానం చేసేందుకై ప్రణాళికలు రూపొందించుకుంటుందని మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి వివ‌రించారు. మెట్రో రైలుతో కలిసి టికెట్ల ఏర్పాటుకు ఇప్పట్లో అలోచనలు లేవని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ రూట్ లో 1700 బస్సులు 70% ఓఆర్ తో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని అన్నారు. పొల్యూషన్ రాకుండా కొత్త బస్సులను ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ఉన్నంతలో ఎలక్ట్రిక్ బస్సుల సేవలను వినిగించుకుంటామ‌న్నారు. ముంబాయి, బెంగుళూరు తరహాలో రవాణా సేవలు అందిస్తామ‌న్నారు. పార్కింగ్లు ,బస్ బేల కోసం ఏర్పాటు చేస్తామ‌ని,గ్రేటర్లో బస్ స్టాండ్ ల అభివృద్ధికి సహాకారం తీసుకుంటామ‌న్నారు.
జీఈఎస్ సదస్సుకు 90 బస్సులు సిద్ధంగా ఉంచిన‌ట్లు మంత్రి తెలిపారు. 28,29,30 తేదీల్లో సాగే సదస్సుకు 150 దేశాలకు చెందిన సుమారు   1200 మంది ప్రతినిధులు, 300 మంది వాణిజ్య వేత్తలు, 50 మంది ప్రముఖులు హాజరవుతున్న తరుణంలో నీతీ ఆయోగ్, రాష్ట్ర రవాణా శాఖ,ఆర్టీసీ , ప్రభుత్వ అధికారులు వారి బస, రవాణా ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. వీరి కోసం ఆర్టీసీ 60 ఏసీ మల్టీ యాక్సిస్ ఓల్వో బస్సులు,తెలంగాణ టూరిజం 10 బస్సులను ఏర్పాటు  చేస్తామ‌న్నారు. 29 న సీఎం కేసీఆర్ వారి గౌరవార్థం  గోల్కొండ కోటలో ఇచ్టే విందు కోసం మరో 30 ఏసీ వజ్ర బస్సులను ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి వివ‌రించారు.
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri