తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ,ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,ప్రజాకవి గద్దరు హాజరయ్యారు .
ఈ సభలో ప్రజాకవి గద్దరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్యూడల్ రాజ్యాధికారం వచ్చింది .గత మూడున్నర ఏండ్లుగా తానూ కన్నీరు కార్చని రోజు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .అమరులు కన్న తెలంగాణ రాష్ట్రం రాలేదు .విద్యార్ధులు రాజకీయ శక్తిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు .