తెలంగాణ రాష్ట్రంలోనే నల్లమల కీర్తి కిరీటంగా పేరుగాంచిన మద్దిమడుగు అంజన్న క్షేత్రం మరో మేడారం జాతరగా తలపించేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ,ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు .అమ్రాబాద్ మండలం మద్దిమడుగు అలయక్షేత్రంలో అచ్చంపేట బంజార సత్రం నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బాలరాజు ,గిరిజినశాఖ కమీషనర్ లక్ష్మణ్ ,మద్దిమడుగు పిఠాధిపతి జయరంగుస్వామితో కల్సి భూమి పూజ చేశారు .
అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బంజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే ఆంజనేయ స్వామి ఉత్సవాలను కన్నుల పండుగగా జరగడం ..తను మొదటిసారిగా స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన తెలిపారు .ఆంజనేయ మాలా ధారణ 1992లో కేవలం ఐదు మందితో మొదలై నేడు లక్షలమంది స్వాములకు చేరిందన్నారు .మరో శబరీ మల ,మేడారం జాతరగా మారనుందన్నారు.
సరైన మౌలిక సదుపాయాలు లేవని ..భక్తులకు స్నానపు గదులు ,విశ్రాంతి భవనాలు ,రోడ్ల ,విద్యుత్ తదితర వసతులు అవసరం అని గుర్తించాం .తన నిధుల నుండి ఇరవై లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు .మద్దిమడుగు నుండి కృష్ణా నది వరకు సరైన మార్గం లేకపోవడంతో తక్షణమే పది కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఏర్పాటు చేయిస్తాను అని ఆయన అన్నారు .రెండు రాష్ట్రాల ప్రజలకు అనుసంధానంగా ఉన్న మద్దిమడుగు వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతాను అని ఆయన తెలిపారు ..ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ,ప్రజాప్రతినిధులు ,పివో డాక్టర్ వెంకటయ్య ,డీటీడీవో మంగ్యా నాయక్ ,తులసీరాం ,నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్ లక్ష్మణ్ రుధవత్ పాల్గొన్నారు ..