స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి.నిన్న మొన్నటి దాక కటిక నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు మాత్రం లాభాలతో ముగియ్యడం మంచి పరిణామం .బీఎస్ఈసెన్సెక్స్ నూట నలబై ఏడు పాయిట్లు లాభపడి మొత్తం ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలబై నాలుగు పాయింట్ల దగ్గర ముగిసింది.నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్ల లాభంతో పదివేల మూడు వందల తొంబై ఏడు పపాయింట్ల దగ్గర ముగిసింది.డాలర్ మాత్రం మరింత దిగజారి అరవై నాలుగు రూపాయల దగ్గరే ట్రేండింగ్ అవుతుంది.హెచ్సీఎల్ టెక్,మహేంద్ర టెక్ ,టీసీఎస్ ,ఐటీసీ ,ఓఎన్జీసి తదితర కంపెనీలు లాభాలను పొందగా సన్ ఫర్మా ,హిందాల్కో ,బజాజ్ ఫైనాన్స్ ,టాటా స్టీల్ నష్టాలతో ముగిశాయి .