తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఇటు సోషల్ మీడియాలో కూడా టీఆరెస్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నది. వచ్చీరాని తెలివితేటలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం అభాసుపాలు అవుతోంది. తాజాగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మీద బురదజల్లబోయి అడ్డంగా బుక్క్ అయ్యింది కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం.
ట్విట్టర్ లో కేటీఆర్ కు 60% మందే అసలైన ఫాలోవర్లు ఉన్నారని, మిగతా 40% మంది ఫేక్ అని టీఆరెస్ ట్విట్టర్ ఫాలోవర్లలో 70% మాత్రమే నిజమని, 30% ఫేక్ అని నిన్న కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక పోస్టర్ వదిలింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన టీఆరెస్ సోషల్ మీడియా టీం ఆ సమాచారం www.twitteraudit.com అనే వెబ్‌సైట్ ద్వారా వచ్చిందని తెలుసుకున్నది. వెంటనే కాంగ్రెస్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
అదే వెబ్సైట్‌లో శోధించి రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది నిజమైన ఫాలోవర్లు ఉన్నారనే సమాచారం విడుదల చేసింది. ఆ వెబ్‌సైట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉన్న ఫాలోవర్లలో దాదాపు 70% మంది ఫేక్ అట!
అంటే వందలో 30 మందే నిజమైన ఫాలోవర్లు, 70 మంది ఫేక్ ఫాలోవర్లు. ఇంకేముంది ఈ సమాచారం బయటికి రాగానే సోషల్ మీడియాలో జనాలు స్కాంగ్రెస్ పార్టీని, పప్పు బాబాను ఫుట్‌బాల్ ఆడేసుకున్నారు.
కుక్క కాటుకు చెప్పుదెబ్బలా కాంగ్రెస్ చేసిన పిచ్చిపనికి మూతోడ్ జవాబు టీఆరెస్ వర్గాల నుండి రావడంతో అనవసరంగా నిద్రపోతున్న వారిని లేపి తన్నించుకున్నట్టు అయ్యిందని కాంగ్రెసోళ్లు కుయ్యోమొర్రో మంటున్నారట.
అసలే శాసనసభలో జరిగిన రభసతో ఇజ్జత్ పోగొట్టుకున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఎదురుదెబ్బలు తగలడంతో టైం బాలేదు అని తలపట్టుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.
నోట్: నిజానికి www.twitteraudit.com సైటు వాడే టెక్నాలజీ కరెక్టు కాదు. ఏది కరెక్టు ప్రోఫైల్, ఏది ఫేక్ ప్రోఫైల్ అని కరెక్టుగా తెలుసుకునే అవకాశం ఆ వెబ్‌సైటుకు లేదు. వారివన్నీ కాకి లెఖ్కలే.