ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తొమ్మిది వికెట్లను కోల్పోయి ఆఖరి బంతి వరకు పోరాడి లక్ష్యాన్ని ఛేదించింది.
A glorious slog over mid-wicket and @SunRisers beat #MI by 1 wicket#SRHvMI #VIVOIPL pic.twitter.com/NFHcQdr29Z
— IndianPremierLeague (@IPL) April 12, 2018