Home / TELANGANA / మంత్రి కేటీఆర్ ను కలిసిన గుడి వంశీధర్ రెడ్డి..!!

మంత్రి కేటీఆర్ ను కలిసిన గుడి వంశీధర్ రెడ్డి..!!

టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నేత గుడి వంశీధర్ రెడ్డి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కలిశారు.ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకేళ్తు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఇవ్వడంతో పాటు..రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా  వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ…మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీతో ప్రభుత్వ పథకాలను మరింతగా ముందుకు తీసుకపోవడంతోపాటు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంతో లక్షలాది రైతన్నలకు మంచి మేలు జరుగుతుందని చెప్పారు.టీఆర్ఎస్ యువజన విభాగం అధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రైతులకు చేయూత అందిస్తామన్నారు.మంత్రి కేటీఆర్ అభినందించడంతో తన భాద్యత మరింత పెరిగిందని ..ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు.