తన మంచితనం , మానవత్వం , విశాల రాజకీయ దృక్పథంతో తెలంగాణతో పాటు దేశంలోనూ ఒక ఇమేజ్ సంపాదించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రా ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతున్నది . దానికి ప్రధాన కారణం తెలంగాణలో 95 శాతానికి పైగా కేసీఆర్ ప్రజల్లో అభిమానం పెంచుకుంటుంటే ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్ధ పాలన పై అక్కడి ప్రజలు విసుగు చెందుతున్నరు . కేసీఆర్ లాంటి నాయకుడు తమకూ ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో చాలా కాలం నుండి వినపడుతున్నది . ఆంధ్రాలో చంద్రబాబు పాలనతో బాగా విసిగిపోయిన అక్కడి జనాలు ఇప్పుడు కొత్త వాదన తెర మీదకు తీసుకొస్తున్నరు . ఆంధ్రాలో కేసీఆర్ ఒక కొత్త పార్టీని స్థాపించి దానికి సారధ్యం వహిస్తే ఇంకా బాగుంటుందనే అభిప్రాయం ఆంధ్రాకు మేలు జరగాలని కోరుకునే వారిలో వ్యక్తమవుతున్నది . తెలంగాణ అభివృద్ధి మీద సంపూర్ణంగా దృష్టి సారిస్తూ తెలంగాణ ప్రజలకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆంధ్రా ప్రజలకు కూడా మేలు చేయగలిగే శక్తి ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నరు .
అసలు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం వల్ల ఆంధ్రాకు పరోక్షంగా చాలా మేలు జరిగిందని వారు వాదిస్తున్నరు . చాలా సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తుండడంతో తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు కొన్నయినా అమలు చేయాల్సి వస్తున్నదని … లేకపోతే అసలు జీతాలకే డబ్బులు లేవంటూ ప్రజలకు పంగనామాలు పెట్టేవాడని అక్కడి మేధావులు వాపోతున్నరు . కేసీఆర్ తెలంగాణలో ఎప్పుడో అంగన్ వాడీలకు జీతాలు పెంచితే తీరా ఇప్పుడు ఎన్నికల ముందు ఆంధ్రాలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నడని , ఉద్యోగుల , ఆర్టీసీ కార్మికుల పీఆర్సీ విషయంలోనూ తెలంగాణ వల్లే ఆంధ్రా వారికి మేలు జరిగిందని పేర్కొంటున్నరు . వాస్తవానికి అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు తెలంగాణ తరపున కొంత ఆర్ధిక సహాయాన్ని పెద్దమనసుతో ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు . కానీ ప్రధాని ఎలాంటి సహాయం ప్రకటించకపోవడంతో కేసీఆర్ తన ఆలోచనను విరమించుకున్నారు . హై కోర్ట్ విభజన లాంటి చాలా విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం సహకరించకపోయినా కేసీఆర్ అమరావతికి స్పెషల్ స్టేటస్ కు మద్దతు ఇచ్చారని , ఎమ్మెల్సీ లను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఆంధ్రాతో సత్సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చారని అక్కడి ప్రజలు గుర్తు చేస్తున్నారు . కేసీఆర్ తన పనేందో తను చేసుకొని పోతుంటే చంద్రబాబు టీజీ వెంకటేష్ లాంటి తలకాయలేని నాయకులతో దిక్కుమాలిన ప్రకటనలు ఇప్పిస్తూ ఇంకా పరువు పోగొట్టుకుంటున్నారని అక్కడి ఆలోచనాపరులు వ్యాఖ్యానిస్తున్నరు .
వాస్తవానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్ పాలనను సరిగా అంచనా వేయలేని పరిస్థితిలో తెలంగాణలో కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్రులు టీడీపీ కి అనుకూలంగా ఓటు వేశారని కానీ తెలంగాణ లో కేసీఆర్ వల్ల ఇక్కడ స్థిరపడ్డ వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొంటున్నారు . కేసీఆర్ పాలన బాగుండ బట్టే గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలతో బాటు ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్రులు కూడా టీ ఆర్ ఎస్ కు పూర్తిగా మద్దతు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నరు . చంద్రబాబో ఇంకెవరో పిలుపునిస్తే సీమాంధ్ర నుంచి స్థిరపడ్డవారు ఓటు వేయలేదని కేసీఆర్ మీద విశ్వాసం తోనే ఓట్లు వేశారని వారు చెబుతున్నరు . తెలంగాణ లో ఉన్న అందరు ఇక్కడి సంక్షేమ , అభివృద్ధి పథకాలతో సంతోషంగా ఉన్నరని ఇప్పుడు కేసీఆర్ మీద సీమాంధ్రుల్లో వ్యతిరేకత పెంచాలని చూస్తే అది చంద్రబాబుకే బూమరాంగ్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది . ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వం , కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో తెలవదు కానీ తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం భారీ మెజార్టీతో వస్తుందని … ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆంధ్రా తెలుగుదేశం నాయకులు చిల్లరగా మాట్లాడితే ఆ పార్టీకే నష్టమని కొందరు వాదిస్తున్నరు .
వై ఎస్ ఆర్ పార్టీ నాయకుడు జగన్ తెలంగాణ విషయాల్లో తలదూర్చకుండా లౌక్యంగా వ్యవహరిస్తూ ఆంధ్రా మీద పూర్తిగా దృష్టి సారిస్తుంటే చంద్రబాబు మాత్రం ఆలోచన లేకుండా చిల్లరగా ప్రవర్తిస్తున్నాడని అక్కడి ప్రజలే విమర్శిస్తున్నరు . అతి తెలివితో తెలంగాణ ప్రజల్లో ఆదరణ కలిగిన కేసీఆర్ జోలికి వెళితే తెలుగుదేశం పార్టీకే చాలా నష్టమనే భావన అక్కడి రాజకీయ పరిశీలకుల్లో ఉంది . తెలంగాణ లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం కానీ , కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునివ్వడం గానీ చేస్తే తెలుగుదేశం పార్టీకి , చంద్రబాబుకు రాజకీయంగా సమాధి ఖాయమని అక్కడి విశ్లేషకుల వాదన . ఎందుకంటే కేసీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు పిలుపు ఇస్తే పట్టించుకునే పరిస్థితిలో ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్రులు సిద్ధంగా లేరు . అదే కేసీఆర్ గనుక ‘చంద్రబాబును ఓడించి మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోండి ‘ అని పిలుపు ఇస్తే ఆంధ్రాలో టీడీపీ మూడో స్థానానికి పోయినా ఆశ్చర్యం లేదు . ఆంధ్రా ప్రజల నుండి కేసీఆర్ కు విపరీతమైన ఫాలోయింగ్ వస్తున్నా ముందు తెలంగాణ భవిష్యత్తు గాడిలో పడాలనే ఉద్దేశంతో ఆయన చాలా లౌక్యంగా కేంద్రంతోనూ , పక్క రాష్ట్రాలతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఈ విషయాలేమీ అర్ధం చేసుకోకుండా చంద్రబాబు టీజీ వెంకటేష్ లాంటి నాయకులతో చిల్లర కామెంట్లు చేయిస్తే ఆయన పార్టీకి ఆంధ్రాలోనూ ముప్పు తప్పదని అక్కడి రాజకీయ వర్గాల విశ్లేషణ . ఇవన్నీ ఒక ఎత్తయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ చక్రం తిప్పాలని కేసీఆర్ అనుకుంటే ఆ రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయని ఒక పాత్రికేయడు వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం .