భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు తెరతీసింది. నాలుగో రోజే భారత్ గెలిచేందుకు దగ్గరైనా … ఆదిల్ రషీద్ పట్టుదలగకు తోడుగా జేమ్స్ ఆండర్సన్ నిలవడంతో 5వ రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్ బట్లర్ శతకంతో చెలరేగగా… బెన్ స్టోక్స్ అతనికి అండగా నిలిచాడు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా (5/85) కెరీర్ తన నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో లోకేశ్ రాహుల్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు.ఇక చివరిరోజు ఆటలో ఆదిల్ రషీద్ పట్టుదలతో బారత్ బౌలర్స్ కు ఎదురు నిలవగాలడా?లేదా వెంటనే నిస్క్రమిస్తడా? అనేది వేచి చూడాలి.
