తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు.శాసనసభ రద్దు తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన తొలి ప్రచార సభలో ప్రసంగించారు. శ్రావణ శుక్రవారం రోజు తొలి సభలో కాంగ్రెస్ వాళ్లను, కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ గతంలో మాదిరి విచ్చలవిడి ఎన్‌కౌంటర్లు లేవు. అరాచకాలు లేవు. ఎరువుల కోసం ఎదురుచూపులు లేవు. కరెంటు కోతల్లేవు. కుంభకోణాలు, రౌడీయిజం లేవు. గుట్కా లేదు. మట్కాలేదు. 2014 కంటే ముందు ఇవన్నీ వర్థిల్లిన్న మాట నిజం కాదా? మళ్లీ కాంగ్రెస్ వస్తే ఇవన్నీ ప్రారంభమవుతాయి. వీళ్లకు నడపరాదు. తెలివిలేదు. అంత శక్తి లేదు. అందుకే ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ప్రతిపక్షాలకు నిజంగా నిజాయతీ ఉంటే.. ప్రజాక్షేత్రంలో మీకు పలుకుబడి ఉంటే సంతోష పడిపోవాలి కాని.. సభ రద్దు చేస్తే ఎందుకు ఆగమవుతున్నారు? దిల్లీకి ఎందుకు ఉరుకుతున్నారు అంటు ప్రచార సభలో కేసీఆర్ అన్నారు.
