తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ కమిటీ రెండవ అధ్యక్షునిగా పటోళ్ల నరేందర్ రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా ఎర్రబల్లి వినోద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా ఉమా సల్వాజీ, దయానంద్, కటకం, ట్రెజరర్ గా అరుణ్ కుమార్ ఫైడగమ్మల, జాయింట్ సెక్రటరీలుగా యాచమనేని విజేత, అల్లం కిరణ్ కుమార్, ముసుకు సాయిరెడ్డిలు ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి ఆద్వర్యంలో ఈ ప్యానల్ ఏర్పడింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. ప్రపంచ దేశాలన్నిటిలో తెలుగువాళ్లు అందులోనూ తెలంగాణ వాళ్లు ఎక్కువగా ఉన్నది న్యూజిలాండ్ లోనే అన్నారు.
తెలంగాణ యాస, భాష, సాంప్రదాయాలకు న్యూజిలాండ్ ఎంతో గౌరవిస్తుందని తెలిపారు. గతంలో న్యూజిలాండ్ ప్రధాని సైతం తెలంగాణ రాష్ట్ర వేడుక బతుకమ్మ ఆడిన ఘటనను గుర్తు చేసారు. తెలంగాణ అసోసియేషన్ న్యూజిలాండ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కాసుగంటి శ్రీలక్ష్మి, పానుగంటి అరుణశ్రీ, పోకల సౌమ్య, ఎర్రా మధుకుమార్, భూమయోళ్ల ప్రశాంత్ రెడ్డి, కందికట్ల విజయ్ కుమార్, బీ శశాంక్ రెడ్డి, కాలకుంట్ల లక్ష్మణ్, మేకల ప్రసన్న కుమార్, పీ నర్సింగ్, మేచినేని వరుణ్ రావు, తుమ్ము సందీప్ రెడ్డి, కార్తీక్, కే కిరణ్ రెడ్డి, లోక రాజ్ కుమార్ రెడ్డి, నన్నెగాని శ్రీధర్, తోట రాజశేఖర్ లు ఎన్నికయ్యరు. అందరం తెలంగాణ వ్యాప్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు కలిసికట్టుగా కష్టించి పనిచేస్తామని తీర్మానించారు. వీరికి పలువురు న్యూజిలాండ్ పౌరులు అభినందనలు తెలిపారు.