తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో విశిష్ట గుర్తింపు దక్కింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రగతిని నిర్దేశించే కీలక అంశాలకు సంబంధించిన చర్చాగోష్టిని ‘పాలసీ కాంక్లేవ్’ పేరుతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) నిర్వహిస్తోంది. ఈనెల 22వ తేదీన ఐఎస్‌బీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించబోయే ఈ చర్చాగోష్టికి తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు.
ఎంపీ కవితతో పాటుగా, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎయిర్‌ఇండియా సీఎండీ అశ్వని లోహానీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ వినయ్ సహస్రదుబే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, సుప్రీంకోర్టు న్యాయవాది కే.బాలసుబ్రహ్మణ్యం హాజరకానున్నారు. ఈ చర్చాగోష్టి పట్ల ఆసక్తి ఉన్నవారు https://www.isb.edu/Policy-