ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈవెంట్.ఫైనల్ దగ్గరపడే కొద్ది అందరిలో వాళ్ళకి ఇష్టమైన జట్టు గెలవాలని ఆశగా ఉంటుంది.అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నైవర్సెస్ ముంబై జరగనుంది.ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్ కానుంది..ఎందుకంటే ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది.ముంబై ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి..అలా అయితే ఈరోజు మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు కూడా అదే ఆట కొనసాగిస్తే ముంబై కి ఓటమి తప్పదని చెప్పాలి. అంతేకాకుండా ఈ మ్యాచ్ చెన్నైలోనే జరగడంతో లోకల్ సపోర్ట్ కూడా వీళ్ళకు కలిసొచ్చే అంశంమని చెప్పొచ్చు.ఈరోజు పైచెయ్యి ఎవరిదో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
