మొన్న వెలువడిన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు ఇంటర్ బోర్డ్ ఎట్టకేలకు గుడ్ బై చెప్పింది. త్వరలో జరగనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్ కోసం మరో కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఈ నెల 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ పరీక్షకు 3.5 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ప్రాసెస్ చేయాల్సి ఉంది. కాగా.. 2018 – 19 నుంచి మూడేళ్ల పాటు పరీక్ష ఫలితాల నిర్వహణ బాధ్యతను ఇంటర్ బోర్డ్ గ్లోబరీనా సంస్థకు అప్పగించగా మొదటి సంవత్సరంలోనే ఈ సంస్థ విఫలమైంది. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సంస్థ పై వేటు వేసింది.
