ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద ముగ్గురు యువకులు సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతులు అవినాశ్ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలకట్టు గ్రామస్తులుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
