తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటీవల జరిగిన తొమ్మిది నెలల చిన్నారి ఆత్యాచారం మరియు హత్యకేసు సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇలాంటి దారుణానికి పాల్పడిన జిల్లాలోని శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన నిందితుడు పోలేపాక ప్రవీణ్ ను ఆ తర్వాత రోజే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గత కొద్ది రోజులుగా హన్మకొండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్ గా పనిచేసేవాడు. అయితే 18.06.19తారీఖున ఆర్థరాత్రి సమయంలో హాన్మకొండ కుమార్ పల్లిలో తల్లితో మేడపై నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకుని తీసుకెళ్లి అదే ప్రాంతంలో దగ్గరగా ఉన్న నిర్మానుష్యప్రాంతంలో ఆత్యాచారానికి పాల్పడి హత్యకు పాల్పడిన ఘటన ప్రస్తుతం సంచలన సృష్టించింది.ఈ క్రమంలో స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఈ రోజు శనివారం హోం మంత్రి మహ్మాద్ అలీని కలిసి ఈ కేసు విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని….. నిందితుణ్ణి కటినంగా శిక్షించడానికి చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. 9 నెలల చిన్నారి పై అత్యాచారం మరియు హత్య సంఘటన పై సమాజంలోని అన్ని వర్గాలు ఇది చాలా హేయమైన సంఘటన గా పేర్కొంటూ కఠీన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని హోం మంత్రికి తెలియజేసారు.
ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితుణ్ణి చట్ట ప్రకారం కఠీనంగా శిక్షించడానికి తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ ను హోం మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ ఆదేశించారు.అంతకుముందు చిన్నారి మామయ్య హన్మకోండ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు అధారంగా నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేసి సెక్షన్ 366,302,376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతో పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.నిందితుడిని కఠీనంగా శిక్షించడానికి, చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ కేసులో వేగవంతంగా శిక్ష పడేటట్టు చేయడానికి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ట్రయల్ చేసే విషయంపై ప్రతిపాదనలు చేయాలని వరంగల్ పోలీస్ కమీషనర్ ను హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఆదేశించారు.
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేదనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్