Home / SPORTS / నీ మొండి ధైర్యానికి హ్యాట్సాఫ్ స్మిత్… నువ్వే అసలైన చాంఫియన్‌వి…!

నీ మొండి ధైర్యానికి హ్యాట్సాఫ్ స్మిత్… నువ్వే అసలైన చాంఫియన్‌వి…!

ఛీటర్‌గా ప్రేక్షకుల చేత హేళనకు గురయ్యావు…ప్రపంచం మొత్తం నిన్ను దొంగగా చూసింది..హీరో నుంచి జీరో అయ్యావు..కానీ ఇప్పుడు జీరో నుంచి హీరోవి అయ్యావు..స్మిత్ ఎందుకయ్యా నీకంత నిబ్బరం..నీ గుండె ధైర్యం చూస్తుంటే..శత్రువు కూడా మెచ్చుకోవాల్సిందే. కెప్టెన్‌గా నువ్వు చేసిన ఓ చెడ్డ పనికి ఒక్కసారిగా అథోపాతాళానికి వెళ్లిపోయావు…హీరో నుంచి ఒక్కసారిగా జీరో అయ్యావు. ప్రపంచం మొత్తం నిన్ను ఛీటర్ అని గేలి చేస్తుంటే…తలవంచుకుని కుమిలిపోయావు. ఒక దశలో క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకున్నావు..కానీ క్రికెట్ మీద నీకున్న ప్రేమ నిన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేసింది…మళ్లీ మునపటిలా ఆడుతావా..పరుగుల వర్షం కురిపిస్తావా…మళ్లీ ఆత్మవిశ్వాసంతో 22 గజాల పిచ్‌పై పరిగెడతావా…ఇలా మాలాంటి సగటు క్రికెట్ అభిమానుల్లో ఎన్నో అనుమానాల మధ్య మళ్లీ బ్యాట్ పట్టావు. ఆడబోయేది చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో…అదీ యాషెస్ సిరీస్‌లో అరివీర భయంకరులైన ఫాస్ట్ బౌలర్లతో కూడిన ఇంగ్లండ్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కుంటావా లేదా..అన్న డౌట్లు. మరోవైపు నీ బ్యాటింగ్‌లో పెద్దగా టెక్నిక్ లేదని…ఏదో విధంగా వికెట్‌ను కాపాడుకుంటూ..మెల్లగా ఒక్కో పరుగు చేసుకుంటూ..బండిలాగేస్తున్నావని విమర్శలు…వీటన్నింటి మధ్య మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టావు. మొదటి టెస్టులో నీ జట్టులో తోపుల్లాంటి బ్యాట్స్‌మెన్లు అందరూ ఔటైపోయారు. అప్పుడు క్రీజ్‌లో వస్తుంటే…ఇంగ్లండ్ దురభిమానులు నిన్ను ఛీటర్ ఛీటర్ అంటూ గేలి చేస్తుంటే..నీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు. అయినా మనసులో ఏదీ పెట్టుకోకుండా మొదట క్రీజ్‌లో నిలదొక్కుకుని…ఆ తర్వాత పరుగుల వరద పారించావు. వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు చేసి జట్టును విజయపథంలో నిలిపావు. అవహేళనను తట్టుకుంటూ…మైదానంలో నువ్వు సాగించిన కళాత్మక ఆటను చూస్తుంటే కన్నులపండుగగా ఉంది. ఫాస్ట్ బౌలర్ల బౌన్సర్ల నుంచి తప్పించుకుంటూ…చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ…విషమ పరిస్థితుల్లో నువ్వు సాధించిన సెంచరీలు ఎప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో పదిలంగా ఉంటాయి. మొదటి టెస్టులో పాస్ అయిన నువ్వు రెండో టెస్టులో ఎలా ఆడతావో అనుకున్నాం..ఈ సారి ఇంగ్లండ్ తురుఫ్ ముక్క…జోఫ్రా ఆర్చర్ దెబ్బను ఎలా తట్టుకుంటావో అనుకున్నాం. మళ్లీ మీవాళ్లు చేతులెత్తేశారు. 80 పరుగులకే 4 వికెట్లు పోయాయి. అప్పుడు మళ్లీ నీ ఆట మొదలెట్టావు. క్రీజు మొత్తం నాదే అన్నట్లు కదులుతూ, మంచి బంతులను ధీటుగా ఆడుతూ, వీలు చిక్కితే బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్‌ బౌలర్లకు చిర్రెత్తించావు. . నిలకడగా 145 నుంచి 155 కి.మీ. వేగంతో వస్తున్న ఆర్చర్‌ బంతులను కాచుకుంటూ జట్టు స్కోరును 200 దాటించావు. అప్పటికీ ఆర్చర్‌ వేసిన 71వ ఓవర్‌ చివరి బంతి బలంగా తగిలి నీ ఎడమచేయి వాచిపోయింది. అయినా, మొండిగా ఆడి 80ల్లోకి వచ్చావు..ఓదశలో మళ్లీ సెంచరీ చేస్తావు అనుకున్నాం. అంతలోనే జోఫ్రా ఆర్చర్‌ వేసిన 77వ ఓవర్‌ రెండో బంతి నేరుగా నీ మెడకు తగిలి కుప్పకూలావు… వెల్లకిలా పడుకుని నొప్పితో నువ్వు విలవిలలాడుతుంటే చాలా బాధేసింది. 2014 నాటి ఫిల్‌ హ్యూస్ ఉదంతం తలచుకుని నీకేమయిందో అని మా లాంటి క్రికెట్ అభిమానుల్లో కంగారు పుట్టింది. ఇక నీ సెంచరీ ఖాయమని అనుకుంటే..సడన్‌గా వికెట్ల ముందు దొరికి ఔటైపోయావు. నువ్వు సెంచరీ మిస్ చేసుకున్నందుకు కాసేపు బాధేసినా…నువ్వు చూపిన అసమానమైన ఆట మమ్మల్ని ఆకట్టుకుంది. కష్టాల్లో ఉన్న జట్టును మళ్లీ కాపాడావు. మళ్లీ గెలిచే స్థితికి తీసుకువచ్చావు…నువ్వు గాయపడి మైదానం వీడుతుంటే..ఇంగ్లండ్ దురభిమానులు నిన్ను మళ్లీ ఛీటర్ అని గేలి చేస్తుంటే బాధేసింది..ఓకే తప్పు చేశావు..శిక్ష అనుభవించావు..మళ్లీ ఆటలోకి వచ్చావు..నీ ఆటతో మళ్లీ నువ్వు చాంఫియన్‌వి అనిపించుకున్నాం. ఎవరేం అనుకుంటే..ఏంటీ స్మిత్…నువ్వు హీరో నుంచి జీరో అయ్యావు..మళ్లీ జీరో నుంచి హీరో అయ్యావు..నువ్వు అసలైన ఛాంపియన్..అంతే..ఆట పట్ల నీకున్న అంకిత భావానికి, అంతులేని నీ సహనానికి, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చూపే మొండి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..స్మిత్..యు ఆర్ ద రియల్ ఛాంపియన్.. అంతే.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat